హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి పులిహోర ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ ప్రధానార్చకులు మార్కేండయ శాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ తెలిపారు. పాకశాలలో తయారు చేసే రోజూవారీ ప్రసాదాలు నియమనిష్ఠలతో, శుచీశుభ్రతలతో ప్రధానార్చకుల పర్యవేక్షణలో జరుగుతాయని వెల్లడించారు.
శ్రీశైల క్షేత్ర ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, భక్తుల మనోభావాలను కించపరిచేందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయని, వీటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. పులిహోర ప్యాకెట్లో కనిపించిన గుర్తు తెలియని వస్తువులను ఎముకలుగా భావించి ఓ భక్తుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.