Ayodhya | రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరిత మానస్ ఏదీ.. ప్రశ్నించిన దాత.. విరాళాల మాయంపై సాగుతున్న విచారణ
Ayodhya : అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల మాయం కేసు విచారణ కొనసాగుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులోని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాము అందించిన రూ.5 కోట్ల విలువైన బంగారం తాపడం కలిగిన రామచరిత మానస్ కనిపించడం లేదని దాత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణన్ చెప్పారు.
Ayodhya : అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల మాయం కేసు విచారణ కొనసాగుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులోని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో విలువైన కానుక విషయంలో దాత సందేహాలు లేవనెత్తారు. తాము అందించిన రూ.5 కోట్ల విలువైన బంగారం తాపడం కలిగిన రామచరిత మానస్ కనిపించడం లేదని దాత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణన్ చెప్పారు. ఈ అంశంపై లక్ష్మీ నారాయణన్ మాట్లాడుతూ.. తాను, తన కుటుంబ సభ్యులతో కలిసి 2024 ఏప్రిల్లో రామాలయం బాధ్యతలు చూసే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు తాపడం కలిగిన రామచరిత మానస్ను విరాళంగా అందించినట్లు చెప్పారు.
తర్వాత ఈ కానుక కొంతకాలం దేవాలయంలో అందరికీ కనిపించేలా ఉంచారు. మరికొంతకాలం తర్వాత నుంచి ఈ రామచరిత మానస్ కనిపించడం లేదని, అక్కడినుంచి తొలగించారని అన్నారు. ఈ అంశంపై తాను ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ను ప్రశ్నించినట్లు చెప్పారు. దానికి చంపత్ రాయ్ సమాధానమిస్తూ.. ప్రతి కానుకను అందరికీ కనిపించేలా ఆలయంలో ప్రదర్శించలేమని చెప్పినట్లు లక్ష్మీనారాయణన్ అన్నారు. అయితే, ఈ కానుక విషయంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కానుక ఏమైందో తెలపాలని కోరుతున్నారు. ఇంతకుముందు కూడా దేవాలయానికి ఇచ్చిన వెండి కడ్డీలు, ఇటుకల విషయంలో కూడా వివాదం తలెత్తింది. ఆ కానుకలు ఏమయ్యాయో తేల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. తాము సమర్పించిన 4 కేజీల వెండి ఇటుకను తాము సమర్పించాని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే అన్నారు.
అలాంటి వాటి సంగతి తేల్చాలని ఆయన కోరారు. అయితే, ఆలయంలో 200 కేజీల వెండి మాయమైందనే వాదనను సిట్ కొట్టిపారేసింది. మరోవైపు రామాలయానికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలు, ఆభరణాల మాయం కావడంపై సిట్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో పలువురిని సిట్ అరెస్టు చేసింది. మరోవైపు బద్రినాథ్ ఆలయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తాజాగా వెల్లడైంది. దీనిపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

