Rain Alert | రాగల రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాగల 12 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో ఉపరితల గాలులు బలంగా వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.