Odisha CM : ఒడిశా సీఎం (Odisha CM) మోహన్ చరణ్ మాఝి (Mohan Charan Maghi) ని కించపరిచేలా రూపొందించిన ఏఐ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కటక్‌కు చెందిన బిశ్వజిత్ (Bishwajit) గా గుర్తించారు. అతడిపై సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం రోజువారీ తనిఖీల్లో భాగంగా సోషల్ మీడియా (Social Media) ను పరిశీలించిన క్రమంలో అతడు సీఎంను కించపరిచేలా అసభ్యకర వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నట్లు బహిర్గతమైంది.
ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఏఐతో రూపొందించిన ఫొటోలు, రీల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నట్లు గుర్తించాం. సీఎంను కించపరిచేలా నిందితుడు కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని, అవి వైరల్ కావడంతో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సోషల్ మీడియా యూజర్లను పోలీసులు హెచ్చరించారు.