ఏయే ఫైళ్లు కాలిపోయాయో చెప్పాలి
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి
- తక్షణమే ప్రభుత్వ రికార్డులపై ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలి
- సీపీఎం కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, నయీం కేసు, భూ కుంభకోణాలు, ఇతర రాజకీయ అవినీతి కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడే ప్రమాదం జరుగడంపై అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. కీలకమైన ఫైళ్లు, డిజిటల్ డాటాకు నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరమున్నదని చెప్పారు. గతంలో సచివాలయం, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రభుత్వ రికార్డులే తగలబడటం వెనుక ఉన్న కారణాలను వెల్లడించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులకు భద్రత కల్పించాల్సిన అవసమున్నదని అభిప్రాయపడ్డారు. ఏయే కేసుల ఫైళ్లు కాలిపోయాయో పూర్తి వివరాలను వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో, రికార్డ్ రూముల్లో అగ్నిప్రమాదాల నివారణకు తక్షణమే ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

