e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home తెలంగాణ పరిశ్రమలకు ఇదిగో చోటు!

పరిశ్రమలకు ఇదిగో చోటు!

  • ఔత్సాహికులకు టీఎస్‌ఐఐసీ ఆహ్వానం
  • వివిధ జిల్లాల్లో ప్లాట్లు, షెడ్ల ఖాళీలు వెల్లడి
  • పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని పిలుపు

హైదరాబాద్‌, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆహ్వానం పలికింది. ఆసక్తిని బట్టి వివిధ పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు అవకాశం కల్పిస్తున్నది. వివిధ పారిశ్రామిక జోన్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లు, షెడ్ల వివరాలను సోమవారం వెల్లడించింది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం వివిధ జిల్లాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.  ఔత్సాహికులు తమ ఆసక్తికి అనుగుణంగా ఎంపికచేసుకున్న పారిశ్రామికవాడలో ప్లాట్లను పొందేందుకు స్థానిక జోనల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవీ అందుబాటులో ఉన్న ప్లాట్లు.. 

  • సైబరాబాద్‌ జోన్‌: వికారాబాద్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో జనరల్‌ ఇంజినీరింగ్‌ యూనిట్లు, రకమ్‌చెర్ల పారిశ్రామికవాడలో స్టీల్‌ రీరోలింగ్‌ యూనిట్లు, ఏఎన్‌ కోకట్‌ పారిశ్రామికవాడలో ఆటోమోటివ్‌ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్నది.
  • కరీంనగర్‌ జోన్‌: కుందన్‌పల్లి పారిశ్రామికవాడలో ఆటోమోటివ్‌ ఆధారిత పరిశ్రమల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
  • ఖమ్మం జోన్‌: భద్రాచలం, కొత్తగూడెం, అన్నారగూడెం, పాల్వంచ పారిశ్రామికవాడల్లో జనరల్‌ పరిశ్రమల ఏర్పాటుకు, బుగ్గపాడు పారిశ్రామికవాడలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు వీలుంది. పాల్వంచ జనరల్‌ పారిశ్రామికవాడలో 18 షెడ్లు ఖాళీగా ఉన్నాయి. 
  • మేడ్చల్‌ సిద్దిపేట జోన్‌: కుషాయిగూడ, మౌలాలి, సిద్దిపేట, మందపల్లి, మల్లాపూర్‌, ఉప్పల్‌, చర్లపల్లి పారిశ్రామికవాడల్లో గ్రీన్‌ క్యాటగిరీ యూనిట్లు, జీడిమెట్ల, కుచారంలో జనరల్‌ క్యాటగిరీ యూనిట్లు, బీటీపార్కు ఫేస్‌-2లో బయోటెక్‌ ఇండస్ట్రీస్‌, బీటీపార్కు కర్కపట్లలో బయోఫార్మా, ఆర్‌ అండ్‌ డీ, వ్యాక్సిన్‌ యూనిట్ల ఏర్పాటుకు వీలుంది. తూప్రాన్‌లో ఆటోమోటివ్‌ ఆధారిత ఇండస్ట్రీస్‌ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 
  • నిజామాబాద్‌: బోధన్‌లో ఆటోమోటివ్‌, నిర్మల్‌, సారంగపూర్‌లో జనరల్‌ క్యాటగిరీ పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు ఉన్నాయి. 
  • పటాన్‌చెరు జోన్‌: పాశమైలారం, సుల్తాన్‌పూర్‌లో జనరల్‌ క్యాటగిరీ, ఇంద్రకరన్‌లో రీ లొకేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌, బుచ్చెనపల్లి ఎడిబుల్‌ ఆయిల్‌ పార్కులో రీలొకేషన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌, బుచ్చెనపల్లి ఎం అండ్‌ ఎంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థకు, పాశమైలారంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ప్లాట్లను రిజర్వుచేశారు. శివనగర్‌ ఎల్‌ఈడీ పార్కులో ఎల్‌ఈడీ పరిశ్రమలకు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 
  • శంషాబాద్‌ జోన్‌: ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌, నాదర్‌గుల్‌లో ఏరోస్పేస్‌ యూనిట్లు, మంకాల్‌ ప్లాస్టిక్‌ పార్కులో ప్లాస్టిక్‌ యూనిట్లు, జడ్చర్లలో గ్రీన్‌ ఇండస్ట్రీస్‌,పాలెం, మహేశ్వరంలో జనరల్‌ ఇండస్ట్రీస్‌, ఈ సిటీ సెజ్‌లో సోలార్‌, ఫ్యాబ్‌ ఇండస్ట్రీస్‌కు ఈఎంసీ మహేశ్వరంలో ఎలక్ట్రిక్‌ వస్తువులు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 
  • వరంగల్‌ జోన్‌: మడికొండ, కల్లెం, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో టెక్స్‌టైల్‌ యూనిట్లు, మడికొండలో ఐటీ, ఐటీఈఎస్‌ యూనిట్లు ఏర్పాటుకు ప్లాట్లు ఉండగా, రాంపూర్‌ పారిశ్రామికవాడను జనరల్‌ క్యాటగిరీలో ఉంచారు. 
  • యాదాద్రి జోన్‌: కోదాడ పారిశ్రామికవాడను జనరల్‌ క్యాటగిరీకి, రాయిరావ్‌పేట్‌ ను ఎస్‌ఎంఈ యూనిట్లకు రిజర్వుచేశారు. 

పెట్టుబడులకు ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌!

పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటుచేయాలని టీఎస్‌ఐఐసీ యోచిస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఎఫ్‌ఐసీసీఐ ఆధ్వర్యంలో కేంద్రం జాతీయస్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ను నిర్వహిస్తున్నది. ఇదే తరహాలో రాష్ర్టాల్లో నూ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌లను ఏర్పాటుచేయాలని ఆకాంక్షిస్తున్నది. సోమవారం ఇన్వెస్ట్‌ ఇండియా అధికారులు రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేసి రాష్ట్రంలోని అవకాశాలను వివరిస్తూ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించాలని కోరింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరిశ్రమలకు ఇదిగో చోటు!

ట్రెండింగ్‌

Advertisement