ప్లస్ 2కి.. ఇంటర్‌బోర్డే ముద్దు
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లంటే మన దగ్గర యమ క్రేజీ. ఈ స్కూళ్లల్లో సీట్ల కోసం సిఫారసులు సర్వసాధారణం.
- మన సిలబస్‌పై సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థుల ఆసక్తి
- ఏటా 30వేలకు పైగా విద్యార్థులు ఇంటర్ బోర్డులో చేరిక
- ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలే ఇందుకు కారణం
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లంటే మన దగ్గర యమ క్రేజీ. ఈ స్కూళ్లల్లో సీట్ల కోసం సిఫారసులు సర్వసాధారణం. అయితే ఇదంతా పదో తరగతి వరకే. ప్లస్ 2 లెవల్‌కి మాత్రం విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. పదో తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులు.. ప్లస్ 2కి మాత్రం ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో చేరుతున్నారు. ఏటా 30వేలకు పైగా విద్యార్థులు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లకు గుడ్‌బై చెప్పి.. ఇంటర్బోర్డులో ప్రవేశాలు పొందుతున్నారు. నిరుడు 27వేలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందగా, ఈ ఏడాది కూడా ఇలాంటి వారి సంఖ్య గణనీయంగానే ఉన్నది.
ఎంసెట్ కారణంగానే..
రాష్ట్ర విద్యార్థుల్లో అత్యధికులు ఎంసెట్ రాస్తుంటారు. ఈ పరీక్షను స్టేట్ సిలబస్, తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా నిర్వహిస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అనుసరిస్తారు. ఈ పుస్తకాలు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ విద్యార్థులకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటాయి. మన దగ్గర జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులున్నా.. ఐఐటీల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో ఎంసెట్‌ను ఎంచుకొంటున్నారు. ఇందుకు ఇంటర్‌బోర్డు సిలబస్ మంచిదన్న భావనతో విద్యార్థులు ఇటువైపు చూస్తున్నారు. ఇంటర్ బోర్డు సిలబస్ అనేక పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుండటం కూడా ఇందుకు ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పోటీ పరీక్షలకు మన సిలబస్ అనుకూలం
ఇంటర్‌బోర్డు సిలబస్ ఉత్తమం. సీబీఎస్ఈ పుస్తకాల తరహాలో సిలబస్‌ను రూపొందించాం. సీబీఎస్ఈకి భిన్నంగా మన దగ్గర గణితంలో రెండు పేపర్లు అమలుచేస్తున్నాం. ముఖ్యంగా ఎంసెట్ వంటి పోటీపరీక్షలు రాసే వారికి ఇంటర్ బోర్డు సిలబస్ అనుకూలం. అందుకే విద్యార్థులు మన సిలబస్‌ను ఇష్టపడుతున్నారు. ఇతర బోర్డుల నుంచి ఇంటర్బోర్డులో చేరేవారికి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను ఇస్తున్నాం. ఈ ఏడాది 2వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ప్రవేశాలు పూర్తయ్యే సరికి వీరి సంఖ్య 35వేలు దాటుతుంది.
– రమణరావు ఉడిత్యాల, ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ విభాగం, ఇంటర్ బోర్డు
2021-22 వివరాలు
బోర్డు : విద్యార్థులు
సీబీఎస్ఈ : 23,754
ఐసీఎస్ఈ : 3,624
మొత్తం : 27,378
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

