BRS | సర్కారు వైఫల్యాలపై సమరమే.. ఆరు గ్యారెంటీల అమలుకు బీఆర్ఎస్ పట్టు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం ముందు ఉంచనున్నది.
- అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహమిదే
- కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల అమలుకు పట్టు
- నిరుద్యోగ సమస్యలపై నిలదీత.. రుణమాఫీపై రణం
- బడ్జెట్ సెషన్లో చర్చకు ఒత్తిడి తేనున్న ప్రధాన ప్రతిపక్షం
- నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. కేసీఆర్ దిశానిర్దేశం
BRS | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం ముందు ఉంచనున్నది. దాదాపు 10 కీలకమైన అంశాలను చర్చించడానికి పట్టుబట్టాలని ఒత్తిడి తీసుకురానున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఆయా వర్గాలను మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే అన్నింటినీ అమలు చేస్తామని అలవికాని హమీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్న కాంగ్రెస్‌పై తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 200 రోజులు దాటింది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇవేవీ అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం మాత్రం అన్నింటినీ అమలు చేశామని చెప్తున్నది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చెప్తున్న దానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదని, వాస్తవాలు వేరేలా ఉంటే రైతులను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని, అర్హులైన రైతులను తగ్గించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అనేక షరతులు విధిస్తున్నదని ఆరోపిస్తున్నది. నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి వాటిలో ఒక్కటి కూడా అమలుచేయడం లేదని, వారి డిమాండ్ల కోసం నిరసన తెలిపితే పోలీసులతో లాఠీచార్జీలు చేయిస్తున్నారని మండిపడింది. వీటన్నంటినీ సభలో చర్చకు వచ్చేలా చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తే ప్రధాన అంశాలు
1) నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ
2) శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం
3) చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
4) ఆరు గ్యారెంటీల అమలు.. శాసనసభలో చట్టబద్ధత
5) రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగం
6) పంటల మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం-రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదురొంటున్న ఇబ్బందులు
7) గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం – పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం
8) ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదురొంటున్న సమస్యలు
నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

