హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో గురువారం (ఈనెల 11న) ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. ఏపీటీఎఫ్, టీఆర్టీఎఫ్, ఐఫియా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఈ ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కేంద్రం జోక్యం చేసుకుని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చట్ట సవరణ చేసి, ఇన్ సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.