టోక్యో : ఉపాయం ఉండాలే కానీ పని చేయకపోయినా లక్షలు సంపాదించొచ్చు అని నిరూపిస్తున్నాడు జపాన్‌కు చెందిన షోజి మోరిమోటో(41). చొరవ తీసుకొని పని చేయడం లేదనే కారణంతో 2018లో ఇతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆయన ఒక కొత్త కెరీర్‌ను ప్రారంభించాడు. సహచర్యం కోసం తనను ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చని ప్రకటించాడు. అయితే, సహవాసం అంటే శారీరక సంబంధం కాదని నిబంధన కూడా పెట్టాడు. ఇతగాడి ప్రకటన విని కొందరు ఆశ్చర్యపోయారు. ఇంకొందరు అద్దెకు తీసుకోవడం ప్రారంభించారు. అద్దెకు తీసుకున్న వ్యక్తితో కలిసి ప్రయాణించడం, షికార్లకు వెళ్లడం వంటివే మోరిమోటో చేసే పనులు. ఇలా తనను అద్దెకు తీసుకునే వారి నుంచి 2-3 గంటలకు దాదాపు రూ.15 వేల వరకు తీసుకుంటాడు. ఇలా గత ఏడాది ఏకంగా రూ.69 లక్షలు సంపాదించాడు.