భద్రాచలం క్షేత్రంలో మూలమూర్తులకు తిరుకల్యాణం
Bhadrachalam | భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలం క్షేత్రం ముస్తాబైంది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్యాణం నిర్వహించనున్నారు.
భద్రాచలం: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలం క్షేత్రం ముస్తాబైంది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కల్యాన ఘట్టానికి వేదిక అయిన మిథిలా స్టేడియానికి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే ముందుగా మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించనున్నారు. తర్వాత యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహిస్తారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సోమవారం శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై హాజరవనున్నారు.
మహోత్సవంకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తుల కోసం మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు సిద్ధంచేశారు. భద్రాచలం క్షేత్రానికి ఆర్టీసీ 400 బస్సులను నడుపుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

