కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్(Kollapur) మండల పరిధిలోని పలు గ్రామాలలో నూతన సంవత్సరం మొదటి రోజు మంచుతో(Thick fog) స్వాగతం పలికింది. ఉదయం 9 గంటల వరకు పల్లెలలో సూర్యుడు కానరాలేదు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం. కృష్ణా నది తీరం అంతా పొగ మంచు అల్లుకోవడంతో మునుపెప్పుడు చూడని సరికొత్త వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదించారు. పర్యాటకులను సైతం పొగ మంచు అలరించింది. పొగ మంచుతో కొల్లాపూర్ పర్యాటక అందాలకు మరింత శోభ తెచ్చిపెట్టింది. ప్రధాన రహదారులన్నీ పొగ మంచుతో కప్పి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లైట్ల వెలుగులో ప్రయాణాలు కొనసాగించారు. మేఘాలు కిందికి దిగినట్లు కనిపిస్తున్న పొగ మంచు చల్లదనాన్ని ప్రయాణికులు సైతం ఆస్వాదించారు.


Kolla1