హైదరాబాద్, మార్చి 30 (నమస్తేతెలంగాణ): భూములు అమ్మడానికే రేవంత్రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్నారా..? అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం యూనివర్సిటీలో భూములను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకోవడానికి వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం సరికాదని సూచించారు. ప్రభుత్వ ఏడో గ్యారెంటీ భూములు అమ్మడమేనా..? అని ప్రశ్నించారు.