హైదరాబాద్, ఫిబ్రవరి8 (నమస్తే తెలంగాణ): సర్కార్ కులగణన బూటమని సామాజిక, బీసీ, ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తారు. కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కో-ఆర్డినేటర్ పర్వతం వెంకటేశ్వర్, బీసీ పొలిటికల్ జేఏసీ కో కన్వీనర్ మాలి కరుణాకర్, ఏబీజేఎస్ న్యాయవేదిక అధ్యక్షుడు కెడల ప్రసాద్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కులగణన పేరిట ప్రభుత్వం ఎస్సీ, బీసీ జనాభాను తగ్గించి ఓసీ జనాభాను పెంచి చూపిందని విమర్శించారు.