Pollution | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వాహనాల నుంచి వచ్చే కాలుష్య ఉద్గారాల పరిమాణం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా, ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావ టం లేదు. ఇందుకు నిదర్శనమే గత సెప్టెంబర్లో కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ గణాంకాలు. గ్రేటర్ హైదరాబాద్లోని ఆరు ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రాల్లో ఉచిత పీయూసీ నిర్వహించగా వందల సంఖ్యలో మాత్రమే తనిఖీలు చేయించుకున్నారు. వాహనాల నుంచి 61.4 శాతం కార్బన్డయాక్సైడ్, 34 శాతం హైడ్రోకార్బన్, 0.54 శాతం సల్ఫర్డయాక్సైడ్, 0.18 సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్, 0.023 శాతం లెడ్ విడుదలవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు.
పటాన్చెరు, జనవరి 6: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీసీ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులపై టెన్త్ విద్యార్థి తన స్నేహితులతో కలిసి దాడిచేశాడు. వెలిమెల మోడల్ స్కూల్లో పదో తరగతి చదివే బాలాజీ, తొమ్మిదో తరగతి చదువుతున్న సాయి, కార్తిక్ తన బట్టలు ఉతకలేదని కోపంతో తన స్నేహితులతో కలిసి వారిపై దాడిచేయగా కేసు నమోదైంది.