Telangana | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : వారంతా చిరుద్యోగులు. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నామన్న పేరే తప్ప ఉద్యోగ భద్రత ఉండదు. నెలంతా పనిచేస్తే వచ్చేది రూ.15 నుంచి 20వేల లోపే. శ్రమదోపిడీకి చిరునామాగా మారిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రేవంత్ సర్కారు ముప్పుతిప్పలు పెడుతోంది. నెలంతా పనిచేస్తే ఇవ్వాల్సిన వేతనాలు, గౌరభృతి, పారితోషికాలను చెల్లించడం లేదు. ఒకటో తారీకున జీతాలిస్తామన్న రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి 8 నెలలు గడిచినా పరిస్థితిలో మార్పురాలేదు. రాష్ట్రంలోని కొంతమంది ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు.