హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 800 మోగావాట్ల థర్మల్‌ప్లాంట్‌ను నెలకొల్పేందుకు జెన్కో చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ (కేటీపీఎస్) స్థానంలో అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్లాంట్ ప్రాథమిక అధ్యయన బాధ్యతలను ఢిల్లీకి చెందిన ఓ సంస్థకు అప్పగించినట్టు జెన్కో అధికారులు చెప్తున్నారు.