రెబ్బెన, జూన్ 30: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టడం, పార్టీ నాయకులతో కూడిన ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడంపై రగడ జరిగింది. నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతుండగా, ఆసిఫాబాద్ ఎ మ్మెల్యే కోవ లక్ష్మి అక్కడికి చేరుకున్నారు.
అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు కనిపించడంతో అక్కడున్న డీఎంహెచ్‌వో, కలెక్టర్‌తో మాట్లాడి కార్యక్రమంలో పా ల్గొనకుండానే వెళ్లిపోయారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే పట్ల కావాలనే వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.