నాగర్‌కర్నూల్ ; చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్‌రెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరపాలని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ హత్యలో మంత్రి జూపల్లి సమాచారాన్ని దాస్తున్నారన్న విషయం పోలీసులకు కూడా తెలుసని పేర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ హత్యపై ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని తెలిపారు. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే మాటలతోనే కాంగ్రెస్ శ్రేణులు మరింత పెట్రేగిపోతున్నాయని మండిపడ్డారు.