Revanth Reddy US Tour | రేవంత్ అమెరికా టూర్ క్యాన్సిల్.. కారణం బయటపెట్టిన విదేశాంగ శాఖ
Revanth Reddy US Tour | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
Revanth Reddy US Tour |హైదరాబాద్, ఆగస్టు 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అనుచిత సమావేశాల వల్లే అనుమతిని నిరాకరించామని, ముఖ్యమంత్రి హోదాకు, ఉద్దేశానికి అనుగుణంగా ఈ పర్యటన లేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యూకేకు ఓకే, కానీ..
రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రులతోపాటు ఇతర ప్రముఖుల వి దేశీ పర్యటనలకు అనుమతులు మంజూ రు చేసేముందు విదేశీ వ్యవహారాల శాఖ సమీక్షిస్తుంది. విదేశీ పర్యటనకు రాజకీయ అనుమతి పొందాలంటే.. ప్రతిపాదిత కా ర్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తున్న హోదా కు, పర్యటన ఉద్దేశానికి తగ్గట్టు ఉండాలి. సీఎం రేవంత్ అమెరికా పర్యటన ఈ విషయంలో అనుచితం (నాట్ అప్రొప్రియేట్)గా ఉన్నది. అందుకే, అనుమతి నిరాకరించాం. ఇదే సమయంలో యూకే పర్యటనకు అనుమతి ఇచ్చాం’ అని తెలిపారు.
గతంలోనూ ఈ సీఎంలకు కూడా..
ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతిని నిరాకరించడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలువురు సీఎంల విదేశీ పర్యటనల అభ్యర్థనలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిరాకరించింది. ఈ జాబితాలో పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్(చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్-2026, ఫ్రాన్స్-2025), బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ (నేపాల్, ఇటలీ-2021, అమెరికా-2018), ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (సింగపూర్-2022, డెన్మార్క్-2019), జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ (థాయ్‌లాండ్-2012), అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగొయి (ఇజ్రాయెల్, అమెరికా-2012) తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

