RS Praveen Kumar | తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్థంగా ఉంది.. కేబినెట్లోనే ఒకరికొకరి మధ్య సయోధ్య లేదనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తే తెలిసిపోతుందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి డైరెక్టుగా లండన్ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నవిషయం మీదనే ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రితో ఉండే కేబినెట్ మంత్రులే మీడియా సమావేశం గురించి ఏ మాత్రం సమాచారం లేకుండా ఉంటున్నరా..? అని ప్రశ్నించారు.
ఒకటే సచివాలయం. మరి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు ముఖ్యమంత్రి ప్రెస్మీట్ పెడుతుంటే కూడా కేబినెట్ సహచర మంత్రులు కూడా ఎవరూ రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేడు తెలంగాణలో ఉన్నది. అంటే ఒక విషయం మీద కేబినెట్లోనే సయోధ్య లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు
నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూర్చున్న 10 నిమిషాల తర్వాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు
సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీలో ఉండి కూడా, రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెడితే మంత్రులు సమయానికి… pic.twitter.com/Hs2NFHTD6t
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026