హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు గందరగోళంలో పడొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో 6,400 కిలో లీటర్ల పెట్రో ల్ అవసరంగా ఉండగా.. బుధవా రం 10,300 కిలో లీటర్ల పెట్రోల్ సైప్లె జరిగిందని వెల్లడించారు. 8వేల కిలో లీటర్ల డీజిల్ అవసరం ఉండగా 19,300 కిలో లీటర్లు సరఫరా చేసినట్టు తెలిపారు. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతిలో కొంత సమస్య ఏర్పడిన మాట వాస్తవమే అన్నారు. 88 శాతం చమురు ఉత్పత్తులను ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.