వనపర్తి : రైతును మించిన విజ్ఞానవంతుడు లేడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెబ్బేరులో జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశంలో ఎంపీ రాములు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీ, సాగునీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. పచ్చని పంటలకు పాలమూరు నిలయమని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలు చేస్తున్నాం. 8వ విడత వరకు రైతు బంధు రూ.50వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు.