హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు శాసనసభ రద్ద యి రాష్ట్రపతి పాలన వస్తుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనకు తాను ఊహించుకొని మా ట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శాసనసభ ఎందుకు రద్దు అవుతుందని ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊహాజనిత వ్యాఖ్యలకు విలువలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ రద్దు అయ్యే అవకాశం లేదని పేర్కొన్నా రు. అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన ఎక్కడి నుంచి వస్తుందని వినోద్ ప్రశ్నించారు.