సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐవోసీ భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పక్కన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోకు బదులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. భట్టికి బదులు ఉత్తమ్ ఫొటో పెట్టడమేంటని ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఇది అధికారుల తప్పిదమా? అవగాహన లోపమా? అనేది తెలియాల్సి ఉన్నది.
– హుస్నాబాద్
హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 10 నుంచి 12వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.
యూనివర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్‌లు, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో రెండేండ్ల వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది పాలిసెట్ ర్యాంకుల ఆధారం గా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు www.pjtsau.edu.in సంప్రదించాలని సూచించారు.