School Admissions | ఒకే రాష్ట్రం వేర్వేరు అడ్మిషన్లు.. ‘స్టేట్’ స్కూళ్లలో ఐదేండ్లు, సీబీఎస్ఈలో ఆరేండ్లు
ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెం డు విధానాలు అమలవుతున్నాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు, సీబీస్ఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఆరేండ్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
- స్కూల్ అడ్మిషన్ల వయసు విషయంలో గందరగోళం
- పలుమార్లు కేంద్రం లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వం
School Admissions | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెం డు విధానాలు అమలవుతున్నాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు, సీబీస్ఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఆరేండ్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇది 2024-25 విద్యా సంవత్సరంలో తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చాలని చూస్తున్న తల్లిదండ్రులకు ఎదురవుతున్న సంకట స్థితి. ఎన్ఈపీలో భాగంగా 5+3+3+4 విద్యా విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది.
దీంతో పూర్వ ప్రాథమిక విద్య లో పీ1, పీ2, పీ3, ఒకటి, రెండు తరగతు లు చేరాయి. ఈ నేపథ్యంలోనే ఒకటో తరగతి ప్రవేశాలకు ఆరేండ్లుగా కేంద్రం నిర్ధేశించింది. సీబీఎస్ఈకి అనుబంధంగా గల కేం ద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ, ఇతర ప్రైవేట్ పాఠశాలలు ఒకటో తరగతిలో చేరేందుకు ఆరేండ్లు ఉండాలన్న నిబంధనను పాటిస్తున్నాయి. ఈ ఏడాది జూబ్లీహిల్స్‌లోని ఓ సీబీఎస్ఈ పాఠశాల ఎల్కేజీలో 160 మంది విద్యార్థులను చేర్చుకున్నది. తీరా కేంద్రం హెచ్చరికలతో ఆయా విద్యార్థులను నర్సరీలోకి మార్చింది.
విడుదలకానున్న 5 వేల కోట్ల నిధులు
ఎన్ఈపీ అమలు చేస్తే కేంద్రం రూ.5 వేల కోట్ల వరకు నిధులను రాష్ర్టానికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఈపీ సహా ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (ఈసీఈ) సహా కా ర్యక్రమాల అమలుతో ఆయా నిధులు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు పే ర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎన్ఈపీ అమలుపై అధ్యయనానికి గతంలోనే విద్యాశాఖ నలుగురితో కమిటీని నియమించగా, రా ష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆరేం డ్లు ఉండాలని సిఫారసు చేసింది.
8 రాష్ర్టాల్లో అమలుకాని ఎన్ఈపీ
దేశంలో తెలంగాణ సహా 8 రాష్ర్టాలు ఎన్ఈపీని అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరేండ్లకు ప్రవేశాలు కల్పించేందుకు చొరవ తీసుకోవాలని ఇటీవలే కేంద్రం అన్ని రాష్ర్టాలకు లేఖలు రాసింది. ఏడాదికాలంగా కేంద్రం లేఖలు రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ఆరేండ్ల వయో పరిమితిని అమలు చేయాలంటే రెండు జీవోలను సవరించాల్సి ఉంటుంది. జీవో-5, జీవో-20 ప్రకారం ఐదేండ్లుగా నిర్ధారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

