హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నది.
2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు