హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నా అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజలకు భద్రత కరువైంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి. మరీ ముఖ్యంగా బాలికలు, అమ్మాయిల భద్రత గాలిలో దీపంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బండి భగీరథ్ పోక్సో కేసు ఉదంతం మరువకముందే షాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, ప్రజల్ని రక్షించడంలో హోం మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని, ఆయన నిర్లక్ష్యం, పట్టింపులేనితనం వల్లే దారుణ పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేవంత్ పాలనలో రాష్ట్రంలో నేరాలు పె చ్చరిల్లుతున్నాయనే విమర్శలున్నాయి. రెం డున్నరేండ్ల కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వెల్లడించిన నివేదికనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. ఈ నివేదిక ప్రకారం నాలుగు నేర విభాగాల్లో(మహిళలపై నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు) రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదై నెంబర్ వన్ స్థానంలో నిలువడం ఆందోళన కలిగిస్తున్నది.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత దిగజారడానికి సీఎం రేవంత్ వైఫల్యమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోం శాఖ మంత్రిగా పోలీస్ శాఖ, శాంతిభద్రతలపై సమీక్షలు నిర్వహించకపోగా, ఎలాం టి సూచనలు, సలహాలు ఇచ్చింది లేదనే ఆరోపణలున్నాయి. హోం మంత్రిగా రేవంత్‌రెడ్డి ఉన్నా తన దగ్గరి వ్యక్తిని షాడో మంత్రిగా పెట్టి వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలున్నా యి. ఇలా రెండు పదవుల్లోనూ బాధ్యతగా ఉండకపోవడం వల్లే పోలీస్ శాఖ గాడి త ప్పిందనే విమర్శలున్నాయి. ఇదే అదునుగా పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలేసి అక్రమ సంపాదన, సెటిల్మెంట్లపై పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపైనా నిఘా కరువైంది. ఓ వైపు గంజాయిని, డ్రగ్స్ లేకుండా ఈగల్తో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెబుతున్నా.. క్షేత్రస్థాయి లో అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నదనే పరిస్థితులు ఉన్నాయనే విమర్శలున్నాయి.
సీఎం రేవంత్ శాంతిభద్రతల కంటే కక్షా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి హత్యలు, మానభంగాలు, దోపిడీలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై బూతుపురాణం లంకించుకోవ డం, పసలేని ఆరోపణలు చేయడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. ప్ర తిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు కేటాయిం చే సమయంలో కొంతైనా శాంతిభద్రతలకు కేటాయిస్తే రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎంతసేపు కుర్చీని కా పాడుకోవడానికి ప్రయత్నాలు చేయడమే తప్ప.. ఆ కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలను కాపాడాలనే సోయి లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.