హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయింది. ఇప్పటికే హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. మరో వెయ్యి బస్సులను ఆర్డర్ చేసింది. వీటితోపాటు 13 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. హయత్నగర్-2, రాణిగంజ్, కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్సీయూ, హైదరాబాద్-2, కరీంనగర్-2, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట డిపోల్లో ఏర్పాటుచేయనున్న చార్జింగ్ స్టేషన్లతోపాటు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్టు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.