ఏటూరునాగారం : ఏటూరునాగారంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుణపంతో సాయిబాబా ఆలయ తలుపు తాళాలను పగలగొట్టిలోనికి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలో ఉన్న హుండీని బయటకు తీసుకొచ్చి అందులో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయింది. దొంగతనానికి పాల్పడానికి వచ్చిన వ్యక్తి ముందుగా సాయిబాబాకు దండం పెట్టుకొని హుండీ బయటకు తీసుకెళ్లిన వీడియో కూడా రికార్డ్ అయింది.
గుర్తు తెలియని వ్యక్తి తాళాలు పగలగొట్టి హుండీని గుడిలో నుంచి బయటకు తీసుకవచ్చి అందులో ఉన్న నగదు ఎత్తుకుపోయాడు. గుడికి సమీపంలో ఉన్న పర్వతాల లాలయ్య అనే వ్యక్తి ఇంటి ముందు బర్రెను కట్టేసి ఉన్న గడ్డపారను తీసుకవచ్చి గుడి తాళాలను పగలగొట్టినట్లు తెలుస్తుంది. అనంతరం గడ్డపారను అక్కడే వదిలేసి వెళ్లాడు. ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ రాజ్‌కుమార్ ఆలయాన్ని సందర్శించి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.