హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ లో పీసీబీ డిజైన్, ఫ్యాబ్రికేషన్‌పై ప్రా రంభమైన రెండు రోజుల వర్క్‌షాపు ఆదివారంతో ముగిసింది. ఆ యూనివర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటి వ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆధ్వర్యం లో వర్క్‌షాపు నిర్వహించారు. విద్యార్థులకు వారి సొంత సర్క్యూట్ బోర్డులను సృష్టించడం, వాటిని పరీక్షించడంలో ఆచరణాత్మక అనుభవాన్ని వ ర్క్షాపు కల్పించింది.
డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, ల్యాప్‌టాప్‌లలో పీసీబీని రూపొందించడం, భాగాల ను జాగ్రత్తగా ఉంచడం, సర్క్యూట్ లే అవుట్‌ను ప్లాన్ చేయడంతోపాటు డిజైన్‌ను ఖరారు చేసిన తర్వాత లే అ వుట్ను బోర్డుపైకి బదిలీ చేసి, భాగాలను అసెంబుల్ చేసేలా వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపు కన్వీనర్‌గా వర్సిటీ డీఐఎల్టీ డైరెక్టర్ ఎం సుష్మ, కో ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ కే హెచ్ ఫణిశ్రీ వ్యవహరించారు.