మంథని, జూన్ 23 : తనను అన్ని విధాలా మోసగించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు దాసరి శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త వేడుకున్నది. ఆదివారం మంథని ప్రెస్‌క్లబ్‌లో మీడి యా సమావేశంలో సదరు మహిళ మాట్లాడింది. తనకు, భర్తకు గొడవలు కాగా, 2015 లో భర్తను వదిలి, ఇద్దరు కొడుకులతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నట్టు తెలిపింది.
ఇంటి పక్కనే ఉండే యువజన కాంగ్రెస్ మం డలాధ్యక్షుడు దాసరి శివకుమార్‌తో పరిచ యం ఏర్పడిందని తెలిపింది. తన ఇద్దరి పిల్లలను చంపేస్తానని బెదిరించడంతో బయట ఇల్లు అద్దెకు తీసుకొని అతడితో తొమ్మిదేండ్లుగా సహజీవనం చేస్తున్నట్టు తెలిపింది.
తనవద్ద రూ.5 లక్షల నగదు, 5 తులాల బంగారం తీసుకున్నట్టు పేర్కొంది. పెండ్లి చేసుకోవాలని కోరితే గత నెల 22న దాసరి శివకుమార్ కుటుంబసభ్యులతో వచ్చి తనపై దాడి చేశారని తెలిపింది. ‘ఇప్పుడు నా గవర్నమెంట్ ఉంది. నాకు మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబు ఆశీస్సులున్నయ్. నిన్ను చంపినా ఎవరూ నన్ను ఏమీ చేయలేరు. నిన్ను చంపి జైలుకు అలా వెళ్లి.. ఇలా వస్తా’ అంటూ అందరు చూస్తుండగానే తనపై దాడి చేశాడని కన్నీటి పర్యంతమైంది. రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.