సంస్థాన్ నారాయణపురం: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని,ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చేపుతున్నారని యాదాద్రిభువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని అల్లం దేవి చెరువు, మల్లారెడ్డిగూడెం, లింగ వారి గూడెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ప్రభుత్వం అందజేస్తున్న పథకాలతో నియోజకవర్గ ఓటర్లు సంతృప్తికరంగా ఉన్నారని, టీఆర్ఎస్కు అన్ని విధాలా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు సుర్వి యాదయ్య, శ్రీనివాస్ గౌడ్, కత్తుల సురేశ్ కుమార్, ఎంపీటీసీ నరసింహ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.