భీమ్‌గల్, జనవరి 17: హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతికహక్కు లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల స మావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఎన్నికలకు ముందు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కాంగ్రెస్ నాయకులతో ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచిపెట్టారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఆ గ్యారెంటీలను పూర్తిగా అటకెక్కించారన్నారు. బాకీ కార్డులను ఇంటింటికీ చేరవేసి కాంగ్రెస్ మోసాలను ప్ర జలకు వివరించాలని నాయకులు, కా ర్యకర్తలకు సూచించారు. సర్పంచ్ ఎ న్నికల్లో సత్తా చూపించామని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని సూచించారు.