బాన్సువాడ, నవంబర్ 21: ప్రభుత్వ, పేదల భూములను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి మింగేశాడని బాధితులు ఆరోపించారు. రవీందర్‌రెడ్డి స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చెందిన భూబాధితు లు చిట్యాల సాయన్న, దుర్గవ్వ, గాదె బాల య్య మంగళవారం బాన్సువాడలో మీడియా తో మాట్లాడారు. 40 ఏండ్ల క్రితం ప్రభుత్వం 25 మంది దళితులకు 30 ఎకరాల అసైన్డ్ భూ మిని ఇచ్చిందని తెలిపారు.
పక్కనే ఏనుగు రవీందర్‌రెడ్డి 300 ఎకరాలు కొనుగోలు చేసి తమ భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. భూముల కబ్జాపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి, పోలీసు స్టేషన్లో వేసి కొట్టించాడని తెలిపారు. కబ్జాకోరు రవీందర్‌రెడ్డిని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు తిరస్కరిస్తే బాన్సువాడకు వచ్చినట్టు తెలిపారు. రవీందర్‌రెడ్డిని నమ్మి ఓటేస్తే బాన్సువాడ ప్రజలు ఎల్లారెడ్డి ప్రజల మాదిరిగా మోసపోతారని హెచ్చరించారు.