ములుగురూరల్, ఏప్రిల్ 21: ములుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో మరో మూడు కొత్త కోర్సులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అనుమతులు జారీచేసింది. 2024 విద్యా సంవత్సరం లో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభమైంది.
ప్రస్తుతం ఇందులో నాలుగేండ్లపాటు కొనసాగే బీఏ ఇంగ్లిష్, బీఏ ఎకనామిక్స్ కోర్సులు రెండేండ్లనుంచి కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి నాలుగేండ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీ ఎస్సీ కంప్యూటర్స్ సైన్స్ అండ్ డాటా అ నలిస్ట్ కోర్సులతోపాటు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ కోర్సులను అందించనున్నారు.