హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులైనవారికి టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి, క్విల్ట్ బ్యాగ్స్ మేకింగ్‌లో, ఐటిఐ/డిప్లొమా ఉత్తీర్ణులకు ఎలక్ట్రీషియన్(డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్, సర్వీస్‌లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
శిక్షణ సమయంలో అభ్యర్థులకు హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అర్హులైన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని సంస్థ కార్యాలయంలో హాజరుకావాలని కోరారు. వివరాలకు 9133908000, 9133908222, 9948466111 లను సంప్రదించాలని పీఎస్ఎస్ఆర్ లక్ష్మి సూచించారు.