Palamuru University | పాలమూరు, డిసెంబర్ 14: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న పాలమూరు యూనివర్సిటీ (పీయూ) పరిధిలో మంగళవారం నుంచి యూజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గురువారం ఆంగ్లం సబ్జెక్ట్ పరీక్షకుగానూ.. కొత్త సిలబస్ కాకుండా పాత సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని అందజేయడంతో అయోమయం నెలకొన్నది.
ఈ విషయమై విద్యార్థులు ప్రశ్నించడంతో కొత్త సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. ఫలితంగా 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రశ్నాపత్రాల పంపిణీలో ఎలాంటి గందరగోళం లేదని పీయూ పరీక్షల నియంత్రణ ఇన్చార్జి అధికారిణి డాక్టర్ శాంతిప్రియ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చారు.