నమస్తే తెలంగాణ, నెట్వర్క్, అక్టోబర్ 1: రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిపి తమ కృతజ్ఞత చాటుకున్నారు. శనివారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకాలు జరిపారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్, జగిత్యాల జిల్లా పెగడపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలాల్లో గిరిజనులు సంబురాలు చేసుకున్నారు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా లంబాడీ హక్కులు, ఆదివాసీ, గిరిజన సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు, గిరిజన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మహబూబాబాద్ మండలం రేగడితండాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. దంతాలపల్లిలో బాణాసంచా కాల్చి గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల కు చెందిన గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్)లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో, మిర్యాలగూడలో గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. సూర్యాపేటలో ఎల్‌హెచ్‌పీఎస్, ఆలిండియా బంజారా సేవా సంఘం నేతలు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేశా రు. మఠంపల్లి మండలం లాలితండాలో గిరిజనులు సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
అనంతగిరిలో టీఆర్ఎస్ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో, కోదాడలో గిరిజన సంఘాల ఆ ధ్వర్యంలో, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గిరిజనులు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో, సంస్థాన్ నారాయణపురం మండలంలోని వెంకబావితండాలో గిరిజనులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గిరిజనులు సంబురాలు జరుపుకొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు సంబురాలు చేసుకున్నారు.