జైనూర్, జూన్ 20: ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య తమ హకులను కాలరాస్తూ అన్యా యం చేస్తున్నారని, ఆయనను వెంటనే సస్పె ండ్ చేయాలని ఆదివాసులు డిమాండ్ చేశారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి ల్లా జైనూర్లోని ప్రధాన రోడ్డుపై ఆదివాసీ సంఘాల నాయకులు, రాయి సెంటర్ కుమ్రం భీం జిల్లా గౌరవాధ్యక్షుడు, గ్రంథాలయ మాజీ చైర్మన్ కనక యాదవరావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కనక యాదవరావు, నాయకులు మాట్లాడుతూ.. డీఎస్పీ సదయ్య ఆదివాసులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, గత మే 13న ముస్లింలు వడ్డెరకాలనీపై దాడి చేస్తే కేవలం 20 మంది ముస్లింలపైనే కేసు నమోదు చేశారన్నారు. దాడుల్లో సిర్పూర్ మండలం పాములవాడకు చెందిన మర్సుకోల లక్ష్మణ్ గాయపడ్డాడని, ఎక్స్‌గ్రేషి యా చెల్లించి, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై సందీప్‌కుమార్ రాస్తారోకో విరమించాలని కోరడంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎస్ఐ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.