హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రజా రవాణా వాహనాలకు ‘వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’ను ఏర్పాటు చేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతున్నది. సీఎం ఆ మోదం అనంతరం కేంద్రంతో ఎంవో యూ కుదుర్చుకోనున్నది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నియంత్రణ లక్ష్యంగా వాహనాల్లో ఈ ‘డివైజ్’లను ఏర్పాటుచేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు వ్యయం రూ.15.40 కోట్లు కాగా, రూ.9.24 కోట్లు కేంద్రం ఇవ్వనుండగా, రాష్ట్రం రూ.6.16 కోట్లు భరించాల్సి ఉంటుంది. వాహనాలను ట్రాక్ చేసేందుకు ఖైరతాబాద్‌లో ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు.