శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 10 : అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బండిని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించడంతో సదరు యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్గేట్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అతివేగంతో వస్తున్న యువకుడిని ఆపి చెక్ చేశారు. బైక్‌ను స్టేషన్‌కు తరలించడం తో ఆ యువకుడు బండి తిరిగివ్వకుం టే చనిపోతానంటూ భయపెట్టా డు. రోడ్డుపై పరుగులు తీస్తూ వాహనాలకు అడ్డుగా వెళ్లాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా స్వల్ప గాయాలయ్యాయి. అతడు నాగర్‌కర్నూల్‌కు చెందిన శివ అని, మద్యం మ త్తులో ఉన్నాడని పోలీసులు చెప్పారు. గతంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో అతడు నిందితుడని పేర్కొన్నారు. కేసు నమో దు చేసి యువకుడిని 108లో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
పారితోషికం లేని సర్వేలను తమతో చేయించకూడదని, పెండింగ్‌లో ఉన్న సర్వేల బిల్లులను చెల్లించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఆదిలాబాద్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సెంట్రలైడ్జ్ కిచెన్ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 14లోగా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. – కామారెడ్డి