హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం టీపీసీసీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. పోటీదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ కసరత్తు చేసి 3+1 అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసినట్టు సమాచారం. తుది నిర్ణయం కోసం ఆ జాబితాను ఏఐసీసీకి పంపించినట్టు తెలిసింది. ఫైనల్ లిస్టు సమాచారంపై కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా హ్యాండిల్ చేస్తున్న సోషల్ మీడియా గ్రూపుల్లో లీకులు వదిలారు.
ఆయా లీకుల ప్రకారం బలమైన బీసీ నాయకునిగా నవీన్‌యాదవ్ పేరు మొదట ఉన్నట్టు తెలిసింది. ఆయనకే తొలి ప్రాధన్యం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఆ తరువాతి పేర్లలో సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ పేర్లను పరిశీలించాలని కోరినట్టు తెలిసింది. ఈ ముగ్గురూ కాని పక్షంలో నాలుగో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంజన్‌కుమార్ యాదవ్ పేరు పరిశీలించాలని ఏఐసీసీని కోరినట్టు విశ్వసనీయ సమాచారం.