హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టు పేరును ప్రిన్సిపాల్‌గా మార్చాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య సలహాదారు పర్వతి సత్యనారాయణ శుక్రవారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎంఈవో పోస్టును ఎంఎల్ఈవోగా మార్చాలని, ప్రతి నాలుగైదు మండలాలకూ ఒక విద్యా డివిజన్ ఏర్పాటుచేయాలని, కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో డీఈవో పోస్టులను భర్తీచేయాలని కోరారు.