హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 26: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ర్ట హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వారి సతీమణి బంధువులతో కలిసి సందర్శించారు. వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్టగణపతికి దర్శనం అనంతరం రుద్రేశ్వరస్వామికి వారి గోత్రనామాలులతో లఘు రుద్రాభిషేకం నిర్వర్తింపజేసి ఆలయ నాట్యమండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. వేదఆశీర్వచనం నిర్వర్తించి ఆలయప్రాశిస్తాన్ని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ వారికి వివరించారు.
సూర్య, విష్ణు ఆలయాల చరిత్ర నాట్యమండపం, స్తంభాలపై వెంట్రుక పట్టే అటువంటి రంధ్రాలు, జిట్టెడు ఆంజనేయస్వామి, తలకిందులచాప తలకిందుల మనిషి, అష్టదిక్పాలకులు గాయత్రిమాత, కళ్యాణమండపం విశేషాలను వారికి వివరించారు. వారు అద్భుతమైన శిల్పకళా అని తెలంగాణ రాష్ర్టంలో ఉండడం మనకు గర్వకారణమన్నారు. కాకతీయులు భారత సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేవిధంగా అద్భుత శిల్పకలని అందించారని ఆయన పేర్కొన్నారు. వారసత్వ సంపదలను సమాజం కాపాడుకోవాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్‌శర్మ, సందీప్‌శర్మ, మణికంఠశర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు. వారికి ఆలయ సిబ్బంది మధుకర్, రజిత,రామకృష్ణ సేవలందించారు. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు.