హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ లాసెట్‌కు రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా 66,620 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మూడేండ్ల లా కోర్సుకు 47,400, ఐదేండ్ల లా కోర్సుకు 14,020, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ లాసెట్‌కు 5,200 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
నిరుడు లాసెట్‌కు 57,700 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 9వేల మంది అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 13వరకు రూ.4వేలు, 15వరకు రూ.10వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.