కేశంపేట, మార్చి 20 : టమాటకు మార్కెట్లో ధర లేకపోవడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు చెందిన వడ్డె జంగయ్య అనే రైతు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 3 ఎకరాల్లో రూ.1.50 లక్షలను అప్పు చేసి 30 వేల మొక్కలు నాటాడు. ఎకరానికి కాకపోయినా మరో ఎకరానికి ధర తగిలితే అప్పులు తీర్చవచ్చనే ఆశతో మూడు పర్యాయాల్లో టమాటను సాగు చేసినా ఫలితంలేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకొని అప్పుల ఊబినుంచి గట్టెక్కించాలని రైతు వడ్డె జంగయ్య కోరుతున్నాడు.