హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని 12,756 గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ నాయకులు టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజనకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శుల నియామకంలో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, వెయ్యికి పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
317 జీవో ద్వారా నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తూ వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రమేశ్, సురేశ్‌గౌడ్, అరుణ్ ఉన్నారు.