రేపటితో ముగియనున్న ప్రచారం.. తారస్థాయికి చేరిన అభ్యర్థుల ప్రచార హోరు
తెలంగాణ పురపాలక ఎన్నికల ప్రచారం ైక్లెమాక్స్‌కు చేరుకున్నది. మంగళవారం సాయంత్రం మొదలైన ఎన్నికల ప్రచార హోరు.. సోమవారం సాయంత్రం ఐదుగంటలతో ముగియనున్నది.
- 11న పోలింగ్.. 11 వేల కెమెరాలతో నిఘా
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పురపాలక ఎన్నికల ప్రచారం ైక్లెమాక్స్‌కు చేరుకున్నది. మంగళవారం సాయంత్రం మొదలైన ఎన్నికల ప్రచార హోరు.. సోమవారం సాయంత్రం ఐదుగంటలతో ముగియనున్నది. కొన్ని రోజుల ప్రచారపర్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది. రేపు సాయంత్రంతో మైకులు మూతపడనుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో మునిగిపోయారు.
ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5 నుంచి 6 మున్సిపాలిటీలను చుట్టేస్తూ సుడిగాలి ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులు పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
పురపాలక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘స్మార్ట్’ నిఘా వ్యవస్థను సిద్ధం చేస్తున్నది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగనున్నది. 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ 30 జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 11,000 కంటే ఎకువ స్మార్ట్ కెమెరా యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

