హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెట్ శాఖ (ఎంఏయూడీ) పరిధిలోని పలుఅభివృద్ధి పథకాల కోసం రూ.740.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు వెచ్చించాలని ఉత్తర్వులో సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్, వెజ్, నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు, వైకుంఠధామాలు, స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ కేంద్రాల అభివృద్ధికి నిధులు వెచ్చించాలని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులకు రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన ఐదుగురు నర్సుల జాబితాను సిద్ధం చేసి పంపాలని డీఎంఈ, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌ను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ) కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులతోపాటు మిషనరీలు, వలంటరీ ఆర్గనైజేషన్లలో సేవలందిస్తున్న వారికి రూ.లక్ష నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్, మెడల్ అందిచనున్నట్టు శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నది.